Aamir Khan: చెన్నైకి మకాం మార్చనున్న ఆమిర్ ఖాన్... ఎందుకంటే...!
- అనారోగ్యంతో బాధపడుతున్న ఆమిర్ ఖాన్ తల్లి
- చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- తల్లికి దగ్గరగా ఉండాలని ఆమిర్ నిర్ణయం
బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ ఖాన్ చెన్నైకి మకాం మార్చనున్నారు! ముంబయిలో నివసించే అమీర్ ఖాన్ రాబోయే రెండు నెలల పాటు చెన్నైలోనే ఉండనున్నారు. ఆమిర్ ఖాన్ తల్లి ప్రస్తుతం అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లితో ఎంతో అనుబంధం కలిగి ఉన్న ఆమిర్ ఖాన్... ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు తాత్కాలికంగా ముంబయిన వీడి చెన్నైలో ఉండాలని నిర్ణయించుకున్నారు. తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి దగ్గర్లోనే ఓ హోటల్లో ఉండాలని ఆమిర్ ఖాన్ భావిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.
ఆమిర్ ఖాన్ చివరగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్ధా. హాలీవుడ్ హిట్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు ఇది రీమేక్! కానీ, లాల్ సింగ్ చద్ధా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ద్వారానే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఫలితం తర్వాత ఆమిర్ ఖాన్ నటనకు విరామం ప్రకటించారు. ఇక సినిమా నిర్మాణంపై దృష్టి సారిస్తానని తెలిపారు.