మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా... కారణం చెప్పలేను, కామ్‌గా ఉండటమే బెటర్: రేణుదేశాయ్
- సర్కార్ వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్
- అనివార్య కారణాల వల్ల నటించలేకపోయానన్న నటి
- కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు వెల్లడి
ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు. నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానన్నారు. ఆ కారణాలను మాత్రం వెల్లడించలేనన్నారు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని అన్నారు.