చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలి: మాజీ ఎంపీ హర్షకుమార్
- చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ
- చంద్రబాబుపై నేరారోపణ జరిగిందని, నేరం రుజువు కాలేదని వెల్లడి
- ఎలాంటి నేరారోపణ నిర్ధారణ కాకపోయినా నలబై రోజులుగా జైల్లో ఉంటున్నారన్న హర్ష కుమార్
ఆయన ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేయాలని కాంక్షించారు. చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారని, ఈ జైలు వ్యవహారాలను సాధారణంగా అధికారులు పర్యవేక్షించాలని, కానీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేత సజ్జల పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు.