'భగవంత్ కేసరి'లో కూతురు పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు: 'అన్ స్టాపబుల్ 3'లో శ్రీలీల
- నిన్ననే మొదలైన 'అన్ స్టాపబుల్ 3'
- ఫస్టు ఎపిసోడ్ లో పాల్గొన్న 'భగవంత్ కేసరి' టీమ్
- బాలకృష్ణ తన భయం పోగొట్టారన్న శ్రీలీల
- ఈ సినిమా ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని వ్యాఖ్య
శ్రీలీల మాట్లాడుతూ .. "బాలకృష్ణగారితో కలిసి పనిచేయడానికి భయపడ్డాను. కానీ ఆ తరువాత ఆయన ఆ భయాన్ని పోగొట్టడంతో ఈజ్ తో చేయగలిగాను. బాలకృష్ణగారు ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. అలాంటి ఒక సినిమాను చేయడానికి బాలకృష్ణగారు ముందుకు రావడం ఆయన మంచి మనసుకు నిదర్శనం" అని అన్నారు.
"ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా చేశాను. 'పెళ్లి సందD' రిలీజ్ తరువాత ఈ ఛాన్స్ వచ్చింది. అప్పుడు చాలామంది కూడా ఈ సమయంలో కూతురు పాత్ర చేయడం మంచిది కాదనే చెప్పారు. కానీ ఇలాంటి ఒక పాత్రను ఇకపై చేసే ఛాన్స్ రాదేమోనని నాకు అనిపించింది. స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను" అని చెప్పారు.