స్టేడియంలో గొడవ.. మహిళా పోలీసుపై దాడి చేయబోయిన అభిమాని
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన
- నరేంద్ర మోదీ స్టేడియంలో యువకుడి చెంప పగులగొట్టిన మహిళా పోలీస్
- ఈ చర్యను తప్పుబడుతున్న నెటిజన్లు
యువకుడి మాటలతో ఆగ్రహించిన పోలీసు అతడి చెంప చెళ్లు మనిపించింది. దీంతో ఆ యువకుడు సైతం చేత్తో ఆమెపై దాడి చేయబోయాడు. దీంతో ఆమె అతడిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. చుట్టుపక్కల కూర్చున్న వారు ఆ యువకుడిని నియంత్రించబోయారు. ఏదో విషయమై యువకుడిని మహిళా పోలీస్ దూషించడం సమస్యకు దారితీసినట్టు తెలుస్తోంది. అయితే, మహిళా పోలీస్ అతడిపై చేయి చేసుకుని ఉండాల్సింది కాదన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.