చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించండి: గవర్నర్‌కు రఘురామ లేఖ
- చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామ లేఖ
- ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్న రఘురామ
- ఐదు కిలోలు తగ్గారని తెలిసిందని, మరింత తగ్గితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన
చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిసిందని, ఆయన బరువు మరింతగా తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.