సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన వెంకటేశ్!
- వరుస హిట్స్ తో ఉన్న వెంకటేశ్
- ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'సైంధవ్'
- 76వ సినిమా కోసం సన్నాహాలు
- ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ
సురేందర్ రెడ్డి మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ పై ఆయన మార్కు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి కాంబినేషన్లోని ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. 'సైరా' .. 'ఏజెంట్' ఫ్లాపుల తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా, ఆయనకి చాలా కీలకమైనదేనని చెప్పాలి.