‘ఉస్తాన్’లో ఇంటర్వెల్ యాక్షన్ పూర్తి చేసిన పవర్ స్టార్
- హైదరాబాద్‌లో పూర్తయిన తాజా షెడ్యూల్
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన చిత్ర బృందం
- హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా
దర్శకుడు హరీష్ శంకర్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పవర్ స్టార్ లుక్స్‌తో పాటు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాశ్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.