మహేశ్ బాబు కూతురు మంచి మనసు.. వీడియో ఇదిగో!
- వృద్ధురాలిని దగ్గరుండి మెట్లు ఎక్కించిన సితార
- లైక్ ఫాదర్.. లైక్ డాటర్ అంటూ మురిసిపోతున్న అభిమానులు
- గతంలో మహేశ్ బాబు ఇలాగే సాయంచేసిన వీడియో కలిపి షేర్ చేస్తున్న నెటిజన్లు
ఈ ఘటనను మహేశ్ అభిమాని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మహేశ్ బాబు కూడా ఇలాగే ఓ మహిళకు సాయమందించారు. ఆ వీడియోతో కలిపి సితార వీడియోను పోస్ట్ చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. పేదలు, వృద్ధుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం అనేది ఘట్టమనేని రక్తంలోనే ఉందని మరో అభిమాని కామెంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు సితారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.