విశాల్ లంచం ఆరోపణలపై స్పందించిన కేంద్రం, సీరియస్‌గా తీసుకున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
- మార్క్ ఆంటోని సినిమా హిందీ వర్షన్ సెన్సార్ కోసం రూ.6.5 లక్షలు ఇచ్చానన్న విశాల్
- సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలు బాధాకరమన్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
- ఈ రోజే విచారణ జరపనున్న సీనియర్ అధికారి
మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ విషయమై తాను రూ.6.5 లక్షలు లంచం ఇవ్వవలసి వచ్చిందని నటుడు విశాల్ గురువారం ట్వీట్ చేశారు. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. మరోదారి లేక తాను డబ్బులు ఇవ్వవలసి వచ్చిందని, తాను ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ప్రధాని మోదీ, మహా సీఎం షిండేలను ట్యాగ్ చేశారు. దీనిని కేంద్ర సమాచార శాఖ సీరియస్‌గా తీసుకున్నది.