Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో కలిసున్న ఫొటో పంచుకున్న శివరాజ్ కుమార్

Shivaraj Kumar shares a pic of Pawan Kalyan

  • సోషల్ మీడియాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ లైవ్ చాట్
  • శివరాజ్ కుమార్ ను పలకరించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
  • పవన్ తో కలిసున్న ఫొటో పంచుకోవాలని కోరిన అభిమానులు
  • వెంటనే స్పందించిన శివరాజ్ కుమార్

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తన కొత్త చిత్రం 'ఘోస్ట్' రిలీజ్ కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరించారు. ఆస్క్ శివణ్ణ పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ లైవ్ చాట్ లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా శివరాజ్ కుమార్ ను ఓ ప్రశ్న అడిగారు. 

"ఘోస్ట్ చిత్రం విజయవంతం కావాలని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. పవన్ కల్యాణ్ గారితో మీకు ఎంతో సాన్నిహిత్యం ఉందని మాకందరికీ తెలుసు. మీ ఇద్దరూ కలిసి ఉండగా చూడాలని అనుకుంటున్నాం. ఏదైనా ఫొటో ఉంటే పంచుకుంటారా?" అని పవన్ ఫ్యాన్స్ కోరారు. 

అందుకు శివరాజ్ కుమార్ స్పందించారు. "ఈ ప్రశ్న అడిగినందుకు కృతజ్ఞతలు. పవన్ నాకు మంచి స్నేహితుడు. పవన్ కూడా నాలాగే మాంచి హుషారుగా ఉంటాడు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, ఇదిగో మీరడిగిన ఫొటో" అంటూ పవన్ తో తాను కలిసున్నప్పటి ఫొటోను కూడా శివరాజ్ కుమార్ పంచుకున్నారు.

Pawan Kalyan
Shivaraj Kumar
Live Chat
Fans
Ghost
Karnataka
  • Loading...

More Telugu News