విశాల్ మాటలు కొత్త సనాతన ధర్మంలా ఉన్నాయి: నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ విమర్శలు
- మూడు, నాలుగు కోట్లు పట్టుకుని సినిమా తీయడానికి రావొద్దన్న విశాల్
- ఇంత బడ్జెట్ లోనే సినిమాను తీయాలనే నిబంధన లేదన్న కార్తీక్
- సినిమాను కోటితో తీయొచ్చు లేదా రూ. 100 కోట్లతో తీయొచ్చని వ్యాఖ్య
సినిమా బడ్జెట్ కథను బట్టి, డిమాండ్ ను బట్టి ఉంటుందని చెప్పారు. ఇంత బడ్జెట్ లోనే సినిమాను నిర్మించాలనే నిబంధన ఏదీ లేదని అన్నారు. ఒక సినిమాను కోటి రూపాయలతో తీయొచ్చని లేదా రూ. 100 కోట్లతో కూడా తీయొచ్చని చెప్పారు. విశాల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరాదని హితవు పలికారు. విశాల్ మాటలు వింటుంటే ఇదొక కొత్త సనాతన ధర్మమేమో అనిపిస్తోందని అన్నారు.