వేధింపుల ఆరోపణలను ఖండించిన నిత్యా మీనన్
- తమిళ్ హీరో వేధించాడంటూ కథనాలు
- వీటిని అవాస్తవాలుగా పేర్కొంటూ ఖండించిన నిత్య
- తాను ఎప్పుడూ అలా చెప్పలేదని స్పష్టీకరణ
ఈ వార్తలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ నిత్యా మీనన్ కోరింది. ‘‘జర్నలిజంలో కొన్ని వర్గాలు ఈ స్థాయికి దిగజారడం ఎంతో బాధను కలిగిస్తోంది. దీనికంటే మెరుగ్గా ఉండాలని కోరుతున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ వదంతుల వ్యాప్తిని ఎవరు మొదలు పెట్టారో చెప్పండి. కేవలం క్లిక్ ల కోసం ఈ తరహా అవాస్తవాలను ప్రచారం చేసే వారిని బాధ్యులను చేయాలి’’ అని నిత్య మీనన్ మండిపడింది.