అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఏడాదిలోనే పూర్తయ్యేలా ప్లాన్!
- ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్న బన్నీ
- రేపటి నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్
- ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం
ఈ గ్యాప్‌లో జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు టాక్. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. బన్నీ కోసం అట్లీ పవర్ ఫుల్ యాక్షన్ తో కూడిన కథను సిద్ధం చేశాడట. జవాన్‌కు మ్యూజిక్ అందించిన అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా చిత్రీకరణను ఏడాదిలోనే పూర్తి చేసే ఆలోచనతో బన్నీ, అట్లీ ఉన్నారని కూడా తెలుస్తోంది.