‘సలార్’ సందడి ఈ ఏడాది లేనట్టే!
- ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం
- ఈ నెల 28న విడుదలను వాయిదా వేసిన చిత్ర బృందం
- వచ్చే మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం
ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలతో పోటీ నేపథ్యంలో సోలో రిలీజ్, పెద్దగా ఒత్తిడి లేకుండా వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. వేసవి కానుకగా 2024 మార్చి 22వ తేదీన సినిమాను విడుదల చేయాలని ఈ మేరకు తమ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వేసవి విడుదలపైనే హోంబలే ఫిలిమ్స్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్‌ను సైతం ఆలస్యంగా మొదలు పెట్టనున్నారు. ఈ లెక్కన వచ్చేనెల ప్రభాస్ పుట్టినరోజు నాడు ట్రైలర్ కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.