హుస్సేన్ సాగర్ ఒడ్డున అందుబాటులోకి మరో పర్యాటక ప్రాంతం
- జలవిహార్ పక్కన 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్క్
- అభివృద్ధి చేసిన హెచ్‌ఎండీఏ
- త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడి
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పార్క్ వీడియోతో పాటు పగలు, రాత్రి తీసిన ఫొటోలను ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు. కాగా, పురపాలక శాఖ మార్గనిర్దేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు, అర్బన్ ఫారెస్ట్‌లు, వాకింగ్ ట్రాక్‌లు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి.