టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వెంకటేశ్
- నేడు ఆసియా కప్ ఫైనల్స్
- ట్రోఫీ కోసం తలపడుతున్న ఇండియా, శ్రీలంక
- కప్ ను గెలిచుకుని తీసుకురండి కెప్టెన్ అన్న వెంకటేశ్
వన్డే ప్రపంచకప్ కు ముందు జరుగుతున్న ఈ ఆసియా కప్ ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఫైనల్స్ కు సిద్ధమైన టీమిండియాకు సినీ నటుడు వెంకటేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్లూ జెర్సీలో ఉన్న మన అబ్బాయిలందరికీ చీరింగ్ అని ట్వీట్ చేశారు. కప్ ను గెలుచుకుని తీసుకురండి కెప్టెన్ అని చెప్పారు. రోహిత్ శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.