నారా లోకేశ్ లేఖ రాసినందుకే జైల్లో రాత్రి పూట రౌండ్ వేశాను: డీఐజీ రవి కిరణ్
- రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా రవి కిరణ్
- చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఆయనను నియమించారని విపక్షాల ఆరోపణ
- నిబంధనల మేరకు భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును తిరస్కరించామని వెల్లడి
చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు తనను సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా నియమించారనే ఆరోపణలు అసత్యమని అన్నారు. చంద్రబాబు భద్రతపై నారా లోకేశ్ అనుమానాలను వ్యక్తం చేయడం వల్లే తనకు సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా తాత్కాలిక బాధ్యతలను అప్పగించారని చెప్పారు. నిబంధనల మేరకు చంద్రబాబుతో ములాఖత్ కోసం ఆయన భార్య భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామని తెలిపారు. చంద్రబాబుకు భద్రతా ఏర్పాట్లను పెంచాలని కోరుతూ లోకేశ్ లేఖ రాయడం వల్లే ఈ నెల 12న రాత్రిపూట జైల్లో రౌండ్ వేశానని చెప్పారు.