రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' పాట లీక్... క్రిమినల్ కేసు నమోదు
- రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్
- పాట లీక్ అయినట్టు గుర్తించిన చిత్రబృందం
- హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఐపీసీ 66 (సి) కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని, గేమ్ చేంజర్ పాటను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తమ కంటెంట్ ను అక్రమంగా బయటకు విడుదల చేశారని, ఏమాత్రం నాణ్యత లేని ఆ కంటెంట్ ను మరింత వ్యాప్తి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. కాగా, గేమ్ చేంజర్ చిత్రంలోని 'జరగండి జరగండి' అనే పాట ఆన్ లైన్ లో లీక్ అయినట్టుగా కేసు నమోదు పత్రాల్లో పేర్కొన్నారు.
