రామ్–బోయపాటితో పోటీ.. వెనక్కితగ్గిన కిరణ్ అబ్బవరం!
- కిరణ్ హీరోగా నటించిన 'రూల్స్ రంజన్' విడుదల ఆలస్యం
- ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటన
- 'స్కంద' అదే రోజున ఉండటంతో అక్టోబర్ 6న రానున్న సినిమా
అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెలాఖరుకు స్కంద సహా నాలుగు చిత్రాలు విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీతం అందించాడు.