ఎంపీ రఘురామకృష్ణరాజుకు లేఖ రాసిన ఎన్నికల సంఘం
- ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని గతంలో ఈసీకి లేఖ రాసిన రఘురామ
- రఘురామ లేఖకు గణాంకాలతో వివరణ ఇచ్చిన ఈసీ
- దొంగ ఓట్ల ఏరివేతకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడి
దొంగ ఓట్ల ఏరివేతకు చర్యలు చేపట్టినట్టు ఈసీ వెల్లడించింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది. జీరో ఇంటి నెంబరుతో 2,51,767 ఓట్లు ఉన్నట్టు వివరించింది.
ఒకే డోర్ నెంబరుతో పది అంతకు మించి ఓట్లు కలిగి ఉన్న ఇళ్లు 1,57,939 అని ఈసీ ఏర్కొంది. ఒకే డోర్ నెంబరు కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది.
