సూపర్ గై అంటూ కోహ్లీని మెచ్చుకున్న అనుష్క శర్మ
- కేఎల్ రాహుల్ కు సైతం అభినందనలు
- రాహుల్, కోహ్లీ ఫొటోలను షేర్ చేసిన అతియా శెట్టి
- ఛాంపియన్స్ అంటూ మెచ్చుకోలు
- చీకటి ముగుస్తుంది.. సూర్యుడు ఉదయిస్తాడంటూ కొటేషన్
అనుష్క శర్మ ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీస్ లో స్పందిస్తూ.. ‘‘సూపర్ నాక్.. సూపర్ గై’’ అంటూ భర్త కోహ్లీని పొగిడేసింది. పనిలో పనిగా తన భర్తతో సమానంగా సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ను కూడా అభినందించింది. ‘‘కంగ్రాష్యులేషన్స్ రాహుల్’’ అంటూ పేర్కొంది. అటు కేఎల్ రాహుల్ జీవిత భాగస్వామి, నటి అతియా శెట్టి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో.. మైదానంలో రాహుల్ సెంచరీ తర్వాత అభివందనం చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. కోహ్లీ, రాహుల్ తో కూడిన ఫొటోను షేర్ చేస్తూ ఛాంపియన్స్ అని కొటేషన్ పెట్టింది. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి సైతం రాహుల్ ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ లోనూ షేర్ చేశారు. ‘‘చీకటి రాత్రి కూడా ముగుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. నాకు అన్నీ నీవే. లవ్ యూ’’ అని అతియా పేర్కొంది.