రూటు మార్చిన ఆనంద్ దేవరకొండ.. గన్స్ పట్టుకొని యాక్షన్ మోడ్‌లోకి!
- బేబి సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న ఆనంద్
- గం గం గణేశా చిత్రంతో రాబోతున్న యువ నటుడు
- ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సమంత
ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో రెండు పెద్ద గన్స్ పట్టుకుని ఆనంద్ నవ్వుతూ కనిపించాడు. బ్యాగ్రౌండ్‌లోనూ గన్స్ పట్టుకున్న ఓ గ్యాంగ్, బాంబ్ బ్లాస్టింగ్ విజువల్స్‌తో కనిపిస్తున్నాయి. దాంతో పాటు రాజా వారి పల్లి అనే బోర్డుపై ‘రన్ ఫన్ గన్’ క్యాప్షన్ రాసి ఉంది. వీటినిబట్టి ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ కామెడీ చిత్రం అని అర్థమవుతోంది. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హై లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.