మూల్యం చెల్లించక తప్పదు.. సమయం వస్తుంది: నారా రోహిత్
- చంద్రబాబును అరెస్ట్ చేయడంపై నారా రోహిత్ ఫైర్
- నియంతృత్వం వాస్తవం అయినప్పుడు, విప్లవం ఒక హక్కు అవుతుందని ట్వీట్
- రోడ్డు మార్గంలో చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న పోలీసులు
మరోవైపు చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. తొలుత ఆయనను హెలికాప్టర్ ద్వారా విజయవాడకు తరలించాలని పోలీసులు భావించారు. అయితే, దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, తన కమెండో సెక్యూరిటీతో పాటే రోడ్డు మార్గంలో వస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆయనను రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. మరోవైపు చంద్రబాబును తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.