ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉండదు.. భారత్-పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డేపై వెంకటేశ్ ప్రసాద్ మండిపాటు
- వర్షం కారణంగా గ్రూప్ దశలో తుడిచిపెట్టుకుపోయిన భారత్-పాక్ మ్యాచ్
- రేపటి మ్యాచ్‌కు రిజర్వు డే ప్రకటించిన ఏసీసీ
- ఇది పూర్తిగా అనైతికమన్న వెంకటేశ్ ప్రసాద్
- రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఏంటని మండిపాటు
- తమకూ రిజర్వ్ డే కావాలన్న బంగ్లాదేశ్
జైషా సారథ్యంలోని ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకని, రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఉండడం అనైతికమని మండిపడ్డాడు. ఇది పూర్తిగా సిగ్గులేని తనమేనని దుమ్మెత్తి పోశాడు. ఇలాంటి హానికరమైన ప్రణాళికలు విజయవంతం కావంటూ ఎక్స్ చేశాడు. రెండోరోజూ వర్షం కురిస్తే అప్పుడేం చేస్తారని ప్రశ్నించాడు.
భారత్-పాక్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ప్రకటించడాన్ని బంగ్లాదేశ్ హెడ్‌కోచ్ చండిక హతురుసింఘ కూడా తప్పుబట్టాడు. కొలంబోలో వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమకు కూడా రిజర్వు డే కావాలని డిమాండ్ చేశాడు.