పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి తాజా కబురు
- నిన్న హైదరాబాద్ లో మొదలైన కొత్త షెడ్యూల్
- ప్రత్యేక సెట్ లో పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్న హరీశ్ శంకర్
- బ్రో సినిమాతో హిట్ అందుకున్న పవన్
ఇందులో పవన్ ఖాకీ డ్రెస్సులో స్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. వీటికోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పవన్ సరసన యువ నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అశుతోష్ రానా, నవాబ్‌షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.