బాక్సాఫీస్ వద్ద జవాన్ మేనియా.. తొలి రోజే అన్ని రికార్డులు బ్రేక్!
- దేశంలో అన్ని భాషల్లో తొలి రోజు రూ. 75 కోట్ల కలెక్షన్స్
- పఠాన్ రికార్డును బద్దలు కొట్టిన జవాన్
- ప్రపంచ వ్యాప్తంగా రూ. 125-150 కోట్లు వచ్చినట్టు అంచనా
ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 నుంచి 150 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది వరకు భారత్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా పఠాన్ రూ.55 కోట్లతో సాధించిన రికార్డును షారుక్ తాజా చిత్రం జవాన్ బ్రేక్ చేసింది. కాగా, తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. దీపిక పదుకొణే, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.