కవల పిల్లల ఫొటోలను పంచుకున్న విఘ్నేశ్, నయనతార
- కృష్ణుడి వేషధారణలో ఉలగ్, ఉయిర్
- ముఖాలు కనిపించకుండా తీసిన ఫొటో
- పిల్లలతో ఎంతో అందంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్నట్టు ప్రకటన
‘‘మా ఇద్దరు కృష్ణులతో ఎంతో అందమైన కృష్ణ జయంతిని, ఆశీర్వచనాల మధ్య జరుపుకుంటున్నాం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ తమ కుటుంబాలు, స్నేహితులతో పండుగ జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాం’’ అంటూ విఘ్నేశ్ శివన్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మరోవైపు నయనతార బాలీవుడ్ ఎంట్రీ అయిన జవాన్ సినిమాకి మంచి స్పందన వస్తుండడం తెలిసిందే.