మొత్తం ఫ్యామిలీతో కలిసి ఆ సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నా: మహేశ్ బాబు
- రేపు విడుదల కానున్న షారుక్ ఖాన్ జవాన్ చిత్రం
- విలన్‌గా విజయ్ సేతుపతి, హీరోయిన్ పాత్రలో నయనతార
- బ్లాక్ బస్టర్ అవ్వాలంటూ శుభాకాంక్షలు తెలిపిన మహేశ్
పలువురు సౌత్ స్టార్లు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడా చిత్రం విడుదల సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇప్పుడు జవాన్ సమయం వచ్చేసింది. షారుక్ ఖాన్ పవర్ మొత్తం వెండితెరపై కనబడబోతోంది. ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.