సత్యసాయి జిల్లాలో దారుణం.. వివాహేతర సంబంధం అనుమానంతో భర్త, అతని ప్రియురాలికి గుండు కొట్టించి ఊరేగించిన భార్య!
- కుటుంబ సభ్యులతో కలిసి భర్త, మహిళను పట్టుకున్న భార్య
- ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పారిపోయిన హుస్సేన్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు
- హుస్సేన్ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు
షబానా ఉండే ప్రాంతానికి వెళ్లిన నజియా అక్కడ వారిద్దరినీ పట్టుకుని గుండుకొట్టించి ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. హుస్సేన్, షబానాకు గుండు కొడుతున్నప్పుడు ఆ దృశ్యాలను నజియా కుటుంబ సభ్యులు వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. నజియా, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితమే నజియా భర్త నుంచి విడిపోయినట్టు పోలీసులు తెలిపారు.