ఆదిత్య ఎల్-1 కక్ష్యను విజయవంతంగా పొడిగించిన ఇస్రో
- తొలి భూ కక్ష్య పొడిగింపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో
- 16 రోజుల పాటు భూ కక్ష్యలోనే చక్కర్లు కొట్టనున్న ఆదిత్య
- సెప్టెంబర్ 5న రెండో భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపట్టనున్న ఇస్రో
16 రోజుల పాటు ఆదిత్య ఎల్-1 భూ కక్ష్యలోనే చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని సూర్యుడిపై పరిశోధలను చేస్తుంది. ఆదిత్యలో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. వీటితో పాటు సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి శోధిస్తాయి.