ఆదిత్య ఎల్-1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుంది: అమిత్ షా
- చంద్రయాన్-3 విజయవంతం
- అదే స్ఫూర్తితో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్-1
- రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇప్పటికే మనం చంద్రుడ్ని అందుకున్నాం, ఇకపై సూర్యుడ్ని కూడా చేరుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఆదిత్య ఎల్-1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం వెలిబుచ్చారు.
75 ఏళ్లలో అనేక విజయాలు సాధించామని, అయితే అంతటితో ఆగిపోకూడదని, నిరంతర కృషి ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందడం అనేది నాయకత్వానికి సవాలు వంటిదని అభిప్రాయపడ్డారు.