రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ఆర్సీ16... జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు
- బుచ్చిబాబు కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్
- త్వరలో షూటింగ్ ప్రారంభం
- తాజాగా ఆర్సీ16 కోసం ఆఫీసు ప్రారంభించిన చిత్రబృందం
- కొబ్బరికాయ కొట్టిన సుకుమార్
తాజాగా, ఆర్సీ16 కోసం హైదరాబాదులో చిత్రబృందం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నేడు దీనికి సంబంధించిన పూజా కార్యాక్రమాలను నిర్వహించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నాయి.

