Rajanikanth: 3వ వారంలో దూసుకుపోతున్న 'జైలర్'

Jailer movie update

  • ఈ నెల 10వ తేదీన విడుదలైన 'జైలర్'
  • 11 రోజుల్లో 500 కోట్లకి పైగా గ్రాస్ 
  • 3వ వారంలోను తగ్గని దూకుడు
  • ఈ వారాంతం కూడా కలిసొచ్చినట్టే 

రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన 'జైలర్' ఈ నెల 10వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, తమిళంలో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకెళుతోంది. దిల్ రాజు - ఏసియన్ సునీల్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయగా, ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో విడుదల తరువాత పెద్ద సంఖ్యలో థియేటర్లను పెంచడం జరిగిన సినిమాలలో 'జైలర్' ఒకటిగా నిలిచింది. 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 500 కోట్ల మార్కును క్రాస్ చేసింది. అత్యంత వేగంగా అత్యధిక వసూళ్లను సాధించిన రజనీ సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది. 

3వ వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. టాలీవుడ్ వరకూ చూసుకుంటే, ఈ వారం కూడా 'జైలర్'కి పెద్ద పోటీ లేనట్టే. ఆ స్థాయి సినిమాలేవీ బరిలో లేవు. అందువలన ఈ వారాంతంలో ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి 'జైలర్' రజనీ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో చేరిపోయినట్టే.

  • Loading...

More Telugu News