విజయ్, సమంత మాదిరిగా స్టేజ్‌పై రొమాంటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విష్వక్సేన్, నేహా శెట్టి
- ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో జంటగా నటిస్తున్న
విష్వక్సేన్, నేహా - తొలి పాటను విడుదల చేసిన చిత్ర బృందం
- డిసెంబర్ 8న విడుదల కానున్న చిత్రం
ఈ పాటను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రమోషన ల్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో హీరోయిన్ ఈ పాటకు స్టేజ్ పైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. అచ్చం సినిమాలో మాదిరిగా స్టేజ్ పైనా ఇద్దరూ రొమాంటిక్ స్టెప్పులు వేశారు. రెండు రోజుల కిందట ఖుషి సినిమా ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ, సమంతా కూడా ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు విష్వక్సేన్, నేహా శెట్టి కూడా వాళ్ల మాదిరిగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా,సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది.