ఎస్పీ గారూ.. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- తాడిపత్రి మున్సిపాలిటీని పెద్దారెడ్డి దోచుకుంటున్నారన్న జేసీ
- ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ఎస్పీకి ప్రశ్న
- చంద్రబాబును సీఎం చేయడం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటానని వ్యాఖ్య
వైసీపీ చెప్పినట్టే జిల్లా ఎస్పీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ గారూ.. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టొచ్చు... అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎవరికి భయపడి సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. తాడిపత్రి కోసం ప్రాణమిస్తానని చెప్పారు. తాడిపత్రి బాగు కోసం రూ. 100 కోట్లు ఇస్తే మున్సిపల్ ఛైర్మన్ గా తాను రాజీనామా చేస్తానని తెలిపారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా పర్లేదని... చంద్రబాబు సీఎం అయితే చాలని చెప్పారు.