విజయ్ దేవరకొండ పెళ్లాడే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఇవే: సమంత
- సమంత, విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ వచ్చే నెల 1న విడుదల
- ప్రచార కార్యక్రమాల్లో బిజీగా బిజీగా హీరోహీరోయిన్లు
- తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, సమంత
- విజయ్‌కు కాబోయే భార్య సింపుల్‌గా, అతడి కుటుంబంతో కలిసిపోయేలా ఉండాలన్న సమంత
- సమంత అభిఫ్రాయంతో ఏకీభవించిన విజయ్
ఇక సమంత విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది. విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజీలే ఎక్కువగా చేస్తాడని చెప్పింది. గేమింగ్ యాప్స్ ఎక్కువగా వాడతాడని, అతడికి ఫ్రెండ్స్ ఎక్కువ అని కూడా పేర్కొంది. సమంత గురించి కూడా విజయ్ పలు విషయాలు చెప్పాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపాడు. సమంతకు కోపం కట్టలు తెంచుకున్నా అసభ్యంగా మాట్లాడదని చెప్పాడు.