అదానీ, అంబానీకి అనుకూలంగా జగన్ పని చేస్తున్నారు: హర్షకుమార్
- కేసులకు లొంగిపోయి బీజేపీకి అనుకూలంగా జగన్ పని చేస్తున్నారని హర్షకుమార్ విమర్శ
- బీజేపీని వీడితేనే పవన్ కు జనాలు బ్రహ్మరథం పడతారని సూచన
- వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు దండగ అని వ్యాఖ్య
జగన్ పాలనలో ఒక్క మంత్రి పేరు అయినా ప్రజలకు తెలుసా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. స్టేజిపై జగన్ ఒకరే కూర్చుంటారని... మంత్రి విశ్వరూప్ ను స్టేజిపై మోకాళ్లపై కూర్చోబెట్టారని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు వేస్ట్ అని చెప్పారు. రూ. 5 వేలతో వాలంటీర్లు వారి కుటుంబాలను పోషించుకోగలరా? అని ప్రశ్నించారు.