నయనతారకు పడిపోయారా? అని ప్రశ్నించిన వ్యక్తిపై షారుక్ ఖాన్ ఆగ్రహం
- షారుక్ ఖాన్, నయనతార కాంబినేషన్లో 'జవాన్'
- సెప్టెంబర్ 7న విడుదలవుతున్న చిత్రం
- అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన షారుక్
మరోవైపు తాజాగా తన అభిమానులతో షారుక్ చాట్ సెషన్ నిర్వహించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 'జవాన్' చిత్రం సందేశాత్మక చిత్రమని, మహిళల సాధికారత గురించి వివరించే సినిమా అని షారుక్ చెప్పారు. మహిళలను ఎలా గౌరవించాలనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించామని తెలిపారు. ఈ చిత్రంలో మీ రొమాంటిక్ యాంగిల్ చూడొచ్చా? అని ఒక నెటిజన్ ప్రశ్నించగా... అన్ని యాంగిల్స్ లో చూడొచ్చని చెప్పారు. మీరు నయనతారకు ఫ్లాట్ అయ్యారా? ఆమెను ప్రేమిస్తున్నారా? అని ప్రశ్నించిన నెటిజెన్ పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అని, ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని అన్నారు.