ఈసారి బిగ్ బాస్ మీ అంచనాలకు అందడు: తాజా ప్రోమోలో నాగార్జున
- మరి కొన్నిరోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్-7
- ఈసారి కూడా నాగార్జునే హోస్ట్
- కొత్త బిగ్ బాస్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందంటూ లేటెస్ట్ ప్రోమో రిలీజ్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్ బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిన్న స్కిట్ ను కూడా ప్రదర్శించారు.