వన్డే మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ కొట్టిన పృథ్వీ షా
- ఫామ్ కోల్పోయి టీమిండియాకు దూరమైన ఓపెనర్
- కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ క్లబ్‌కు ఆడుతున్న షా
- సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో 153 బంతుల్లోనే 244 పరుగులతో రికార్డు
ఇంగ్లండ్ లిస్ట్–ఎ క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన అత్యుత్తమ స్కోరును షా అధిగమించాడు. 2021లో జైపూర్‌లో పుదుచ్చేరిపై ముంబై తరఫున 227 పరుగుల రికార్డును మెరుగు పరుచుకున్నాడు.