Tamannaah: చీరకట్టులో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
![Tamannaah Bhatia latest photo shoot in sary](https://imgd.ap7am.com/thumbnail/cr-20230808tn64d1e47ead1f9.jpg)
- టాలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా తమన్నా
- చిరు సరసన భోళా శంకర్‌లో నటించిన మిల్కీ బ్యూటీ
- రజనీకాంత్ జైలర్ సినిమాలోనూ హీరోయిన్‌గా తమన్నా
శ్రీ అనే చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసిన ఆమె బాలీవుడ్‌లోనూ తన మార్కు చూపెడుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన జైలర్, మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన భోళాశంకర్ ఈనెల 10, 11వ తేదీల్లో విడుదల కానుంది.
ఈ సినిమాల ప్రమోషన్స్‌లో తమన్నా బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తమన్నా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్, లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా చీర, నగలు ధరించి దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఎంతో అందంగా కనిపిస్తున్న తమన్నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![](https://img.ap7am.com/froala-uploads/20230808fr64d1e415446a9.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230808fr64d1e41c37638.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230808fr64d1e42383272.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230808fr64d1e42a8f5e1.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230808fr64d1e432e836d.jpg)