ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు తర్వాత మా పార్టీని కేంద్రం పట్టించుకోదు: రఘురామకృష్ణ రాజు
- జగన్ పర్యటనలో అసలైన బాధితులను తమ నేతలు మాట్లాడనివ్వలేదన్న రఘురాజు
- సభలో జగన్ స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా
- అంబటి రాంబాబు పోలవరం అంశాన్ని చూడాలని హితవు
విపక్ష నేతల యాత్రల్లో జనాలను చూస్తే తమ పార్టీ వాళ్లకు కోపం వస్తుందని రఘురాజు అన్నారు. ఢిల్లీ ఆర్డినెన్సుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తర్వాత తమ పార్టీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదని చెప్పారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు 'బ్రో' సినిమా గురించి మాట్లాడటం మానేసి... పోలవరం ప్రాజెక్టు అంశాన్ని చూడాలని హితవు పలికారు. రూ. 10 వేల కోట్లు తీసుకొచ్చి పోలవరం బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు.