'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి హారర్ థ్రిల్లర్ 'హిడింబ'
- అశ్విన్ బాబీ హీరోగా రూపొందిన 'హిడింబ'
- జులై 20వ తేదీన విడుదలైన సినిమా
- హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమా జులై 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా అశ్విన్ బాబు .. అదే డిపార్టుమెంటులో పనిచేస్తున్న ఆఫీసర్ గా నందిత శ్వేత కనిపిస్తారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
'హిడింబ' అనే ఒక తెగకి చెందిన వ్యక్తులు అడవుల్లో ఎంత ప్రమాదకరంగా ఉంటారు .. ఆ తెగకి చెందిన వ్యక్తి ఈ జనారణ్యంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా. కథలో సస్పెన్స్ ఉంటుంది .. యాక్షన్ ఉంటుంది. కాకపోతే హింస - రక్తపాతం చూసి తట్టుకునే స్వభావం ఉన్నవారే చూసే సినిమా ఇది.