పెళ్లయిన మహిళను నిన్న ఒక వాలంటీర్ తీసుకెళ్లాడు: రఘురామకృష్ణ రాజు
- మొన్న విశాఖలో ఒక మహిళను వాలంటీర్ హత్య చేశాడన్న రఘురాజు
- ఈ దారుణాలకు జగనే బాధ్యత వహించాలని వ్యాఖ్య
- కోడికత్తి శీను జీవితం కూడా మొద్దు శీను మాదిరే అవుతుందేమోనని సందేహం
ఈ దారుణాలకు ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాలని అన్నారు. వాలంటీర్లు బియ్యం ఇవ్వడానికి వచ్చి... మీకు బియ్యం కావాలా? డబ్బులు కావాలా? అని అడుగుతున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
బాబాయ్ వివేకాను హత్య చేసిన వ్యక్తి హాయిగా బయట తిరుగుతున్నాడని... పాపం కోడికత్తి శీను మాత్రం జైల్లోనే ఉన్నాడని రఘురాజు అన్నారు. కోడికత్తి శీను జీవితం కూడా మొద్దు శీను జీవితం మాదిరి అవుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. కోడికత్తి శీను ఉన్న జైల్లో కూడా ఎవరో బీహారీ వ్యక్తి ఉన్నాడని చెపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.