మరోసారి స్క్రీన్ పై మెరవనున్న ప్రభాస్, అనుష్క జోడీ?
- ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే
- వీరిద్దరి కాంబినేషన్లో 'బాహుబలి' చిత్రాలను నిర్మించిన శోభు యార్లగడ్డ
- ఇద్దరి కాంబినేషన్లో శోభు మరో చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ఫిలింనగర్ టాక్
మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోందనేదే ఆ వార్త. 'బాహుబలి' చిత్రాల నిర్మాత ప్రభాస్, అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... వార్త మాత్రం వైరల్ అవుతోంది. మరోవైపు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు చెపుతున్నారు.