'బేబి' దర్శకుడి చేతులమీదుగా 'మదిలో మది' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
- మరో ప్రేమకథగా రూపొందిన 'మదిలో మది'
- నూతన నటీనటులతో నిర్మితమైన సినిమా
- దర్శకుడిగా ప్రకాశ్ పల్లా పరిచయం
- ఆగస్టు 18వ తేదీన సినిమా విడుదల
నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయిరాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మదిలో మది' సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను .. అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు.ఆ మధ్య ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 'బలగం' మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు షారుఖ్ సంగీతం, క్రాంతి నీల - రాజేష్ మధుమాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.