'లియో'లో ఆంటోని దాస్ గా సంజయ్ దత్ .. గ్లింప్స్ రిలీజ్!
- విజయ్ - త్రిష జంటగా రూపొందుతున్న 'లియో'
- 'మాస్టర్' తరువాత లోకేశ్ తో విజయ్ చేస్తున్న సినిమా
- సంజయ్ దత్ ఎంట్రీతో మరింత పెరిగిన 'లియో' క్రేజ్
- అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల
లలిత్ కుమార్ - జగదీశ్ పళనిస్వామి నిర్మిస్తున్న ఈ సినిమాకి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ - త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆంటోని దాస్ అనే కీలకమైన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను .. గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అర్జున్ ... గౌతమ్ మీనన్ ... మన్సూర్ అలీఖాన్ .. ప్రియా ఆనంద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 'మాస్టర్' కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.