'బ్రో' చాలా బాగుంది... పవన్ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం: రఘురామ
- పవన్, సాయితేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో
- నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బ్రో
- ఇప్పుడే బ్రో సినిమా చూశానన్న రఘురామకృష్ణరాజు
"పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రాన్ని ఇప్పుడే చూశాను. పవన్ కల్యాణ్ అభిమానులే కాదు, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. మనిషి బతుకు గురించి, ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కాదన్న విషయాన్ని గురించి ఈ సినిమాలో చూపించారు. పవన్ కల్యాణ్ గారికి, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ గారికి, ఈ చిత్ర నిర్మాత, నా స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు సముద్రఖని, సంగీత దర్శకుడు తమన్, యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు" అంటూ రఘురామ ట్వీట్ చేశారు.