వర్షాలకు హైదరాబాద్ సిటీయే మునిగిపోయింది: బొత్స సత్యనారాయణ
- ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమేనని వ్యాఖ్య
- చంద్రబాబు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్న బొత్స
- కుప్పం కంటే విజయనగరం చాలా బాగుంటుందన్న మంత్రి
హైకోర్టు నోటీసులపై స్పందన
అమ్మఒడి సభకు విద్యార్థులను తీసుకువెళ్లడంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై బొత్స స్పందించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు రావడంలో తప్పులేదన్నారు. వారు కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు సినిమా యాక్టర్లు వస్తారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై కోర్టు సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు.